NRPT: ఉట్కూర్ మండలంలోని వల్లంపల్లి ప్రభుత్వ పాఠశాలను మండల విద్యాధికారి మాధవి ఆకస్మికంగా తనిఖీ చేశారు. విద్యార్థుల హాజరు పట్టికలు, పాఠశాల పరిశుభ్రత, బోధనా విధానాలను ఆమె పరిశీలించారు. ఈ సందర్భంగా విద్యాధికారి మాట్లాడుతూ.. విద్యార్థుల హాజరు శాతాన్ని మరింత పెంచేలా ఉపాధ్యాయులు కృషి చేయాలని సూచించారు.