TG: జూబ్లీహిల్స్ ఉపఎన్నిక పోలింగ్ కొనసాగుతోంది. అయితే, వెంగళరావునగర్ పోలింగ్ బూత్ దగ్గర ఓటర్లను ప్రభావితం చేస్తున్నారని బీఆర్ఎస్ నాయకులు ఆరోపిస్తున్నారు. సత్తుపల్లి ఎమ్మెల్యే భర్త దయానంద్పై బీఆర్ఎస్ నాయకులు ఆర్వోకు ఫిర్యాదు చేశారు. ఓటర్లను ప్రభావితం చేసే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.