NLR: చేజర్ల మండలంలోని ఏటూరు రైతు సేవా కేంద్రంలో సోమవారం యూరియా పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టారు. పంట అధిక దిగుబడులపై మండల వ్యవసాయ అధికారి హిమబిందు రైతులకు పలు సూచనలు చేశారు. యూరియా తగినంత నిల్వ ఉందన్నారు. రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఆమె తెలియజేశారు.