హీరోయిన్ తమన్నా బరువు పెరిగిందని బాలీవుడ్లో వార్తలొచ్చాయి. బరువు తగ్గించుకునేందుకు ఆమె ఇంజిక్షన్లు వాడుతోందని ప్రచారం జరిగింది. దీనిపై తాజాగా తమన్నా స్పందించింది. తన బరువును తగ్గించుకునేందుకు ఎలాంటి ఇంజిక్షన్లు ఉపయోంచలేదని వెల్లడించింది. తాను సహజంగానే అలా ఉన్నట్లు తెలిపింది. కాలానుగుణంగా స్త్రీ శరీరంలో మార్పులు చోటుచేసుకుంటాయని రూమర్స్‌కు చెక్ పెట్టింది.