SKLM: విశాఖపట్నంలో గార మండలం కొర్లాం గ్రామానికి చెందిన యువకుడు నల్ల సంపత్ కుమార్ (32) సోమవారం ఆత్మహత్య చేసుకున్నాడు. గ్రామస్థుల వివరాల మేరకు.. యువకుడు విశాఖ ద్వారక నగర్లో ఓ గదిలో అద్దెకి ఉంటూ ఉద్యోగ ప్రయత్నం చేస్తున్నాడు. ఉద్యోగం రాకపోవడంతో మనస్థాపానికి గురైన అతను ఫ్యాన్‌కు ఉరి వేసుకుని మృతి చెందాడు. దీంతో గ్రామంలో విషాదచాయలు నెలకొన్నాయి.