KMM: పేదలకు ఆహార భద్రత కల్పించే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం కొత్త రేషన్ కార్డుల జారీని వేగవంతం చేసింది. జనవరి నాటి 4,11,143 కార్డులకు అదనంగా 52,406 కొత్త కార్డులు మంజూరయ్యాయి. దీంతో జిల్లాలో మొత్తం కార్డుల సంఖ్య 4,63,549కి చేరింది. ఏప్రిల్ 1 నుంచి ఉచిత సన్న బియ్యం పంపిణీ జరగడంతో కొత్తగా లబ్ధి పొందుతున్న వారికి ఉపశమనం లభించింది.