TG: ఓటు వేసేందుకు యువత ఆసక్తి చూపుతున్నారని కాంగ్రెస్ MLA అభ్యర్థి నవీన్ యాదవ్ పేర్కొన్నారు. యువత భవిష్యత్, నియోజకవర్గ అభివృద్ధి కోసం ఓటేయండని పిలుపునిచ్చారు. జూబ్లీహిల్స్ ఓటర్లంతా ఓటు వేయాలని కోరారు. పోయినసారి కంటే 10 నుంచి 15 శాతం పోలింగ్ పెరగొచ్చని, 45 నిమిషాల్లోనే ఒక బూత్‌లో 60 నుంచి 70 ఓట్లు పోలైనట్లు తెలిపారు. ఈ ఎన్నికల్లో 60% పైగా నమోదయ్యే అవకాశం ఉందన్నారు.