ADB: వాట్సప్‌లో వచ్చిన APK ఫైల్ ఓపెన్ చేసిన ఓ బాధితుడు నగదును కోల్పోయాడని 1 టౌన్ CI సునీల్ కుమార్ తెలిపారు. శాంతినగర్‌కు చెందిన వ్యాపారి తొడంబార్ శ్రీకాంత్ తన తండ్రి పేరు మీద ఉన్న కారుకు చలాన్ కట్టాలంటూ RTO ఈ చలాన్ APK ఫైల్ సందేశం వచ్చింది. ఆ ఫైల్ ఓపెన్ చేయగా.. అకౌంట్ నుంచి 9 విడతలుగా రూ. 2.39 లక్షలు డబ్బులు కట్ అయ్యాయని ఆవేదన వ్యక్తంచేశారు.