బీహార్లో రెండో విడత అసెంబ్లీ ఎన్నికలకు పోలింగ్ ప్రారంభమైంది. ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. పోలింగ్ బూత్ల వద్ద బారులు తీరారు. 20 జిల్లాల్లోని 122 సీట్లకు ఈ ఎన్నికలు జరుగుతున్నాయి. దాదాపు 3,70,13,556 మంది తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. అలాగే, ఢిల్లీలో పేలుడు నేపథ్యంలో పోలింగ్ బూత్ల వద్ద పోలీసులు భద్రతను కట్టుదిట్టం చేశారు.