MBNR: స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో అండర్-14, 17, 19 విభాగాల్లో యోగా, అండర్-17 విభాగంలో ఖో-ఖో ఎంపికలను నిర్వహించనున్నట్లు జిల్లా కార్యదర్శి డాక్టర్ ఆర్.శారదాబాయి తెలిపారు. ఇవాళ మహబూబ్ నగర్లోని డీఎస్ఏ ఇండోర్ స్టేడియంలో ఈ ఎంపికలు ఉంటాయని ఆమె తెలిపారు. క్రీడాకారులు ఒరిజినల్ బోనఫైడ్, టెన్త్ మెమో ఆధార్ కార్డులతో ఉదయం 9 గంటలలోపు రిపోర్టు చేయాలన్నారు.