HYD: ఓటర్ కార్డు లేకున్నా ఓటు వేసే అవకాశాన్ని ఎలక్షన్ కమిషన్ అధికారులు కల్పించారు. జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో పాన్ కార్డు, ఆధార్ కార్డు, ఉపాధి హామీ పని కార్డు, ఇండియన్ పాస్పోర్టు ఇలా మొత్తం 12 కార్డుల్లో ఏ ఒక్కటి ఉన్నా, పోలింగ్ కేంద్రానికి వెళ్లి ఓటు వేసే అవకాశం ఉందని అధికారులు వెల్లడించారు.