TG: జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఉపఎన్నిక పోలింగ్ కొనసాగుతోంది. మొత్తం 4,01,365 మంది ఓటర్లు ఉన్నారు. ఓటేసేందుకు పోలింగ్ స్లిప్ కంపల్సరీ కాదని అధికారులు తెలిపారు. ఓటర్ల జాబితాలో పేరుంటేనే ఓటేసేందుకు వీలుంటుంది. అలాగే, ఓటర్లు పోలింగ్ బూత్‌లోకి మొబైల్ ఫోన్లు, కెమెరాలు, ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్లు, పార్టీ గుర్తులు, ప్రచార వస్తువులు, పదునైన వస్తువులు తీసుకెళ్లడం నిషేధం.