సత్యసాయి: సత్యసాయిబాబా శత జయంతి వేడుకల ఏర్పాట్లను మాజీ మంత్రి పల్లె రఘునాథరెడ్డి పరిశీలించారు. పుట్టపర్తిలో పర్యటించిన ఆయన జరుగుతున్న అభివృద్ధి పనులు, వాహనాల పార్కింగ్ ప్రదేశాలు, పట్టణంలో పారిశుద్ధ్య పనులను క్షుణ్ణంగా పరిశీలించారు. శత జయంతి ఉత్సవాల వేళ భక్తులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా అన్ని ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు.