మహబూబ్ నగర్ జిల్లా కలెక్టర్ విజయేందిర బోయి ప్రజా సమస్యల పరిష్కారంలో నిర్లక్ష్యం వహించవద్దని అధికారులను ఆదేశించారు. సోమవారం జిల్లా సమీకృత కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరించిన ఆమె వాటిని ఎప్పటికప్పుడు పరిష్కరించాలని సూచించారు.