SRD: కర్ణాటకలోని బీదర్ సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్ర గాయాలై నిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న జర్నలిస్ట్ ప్రతాప్‌ను జహీరాబాద్ MP సురేష్ షేట్కార్ పరామర్శించి ఆరోగ్య పరిస్థితులు అడిగి తెలుసుకున్నారు. ప్రమాదంలో ఆయన కాలు, చేయి విరిగి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈయనకు నాణ్యమైన వైద్య చికిత్సలు అందించాలని ఎంపీ వైద్యులను కోరారు.