VZM: కొత్తవలస పోలీసు స్టేషన్ పరిధి ఆర్టీసీ కాంప్లెక్స్ వద్ద 15 రోజుల క్రితం జరిగిన రోడ్డు ప్రమాదంలో వృద్దుడు గాయపడ్డాడు. స్థానికులు గుర్తించి 108 అంబులెన్స్‌లో విశాఖ కింగ్ జార్జ్ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ సోమవారం రాత్రి మరణించినట్లు సీఐ షణ్ముఖరావు తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. మృతుని వివరాలు తెలియాల్సి ఉంది.