NLR: ప్రధాన పంట కాలువల్లో పూడికతీత పనులు చేపట్టాలని భారతీయ జనతా పార్టీ నేత రమేష్ డిమాండ్ చేశారు. ఈ మేరకు సోమవారం జల వనరుల శాఖ పరిపాలన అధికారి కృష్ణయ్యకు వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సమస్యను పరిగణనలోనికి తీసుకోకుండా నీటిని విడుదల చేస్తే రెండు టీఎంసీల నీరు వృధా అవుతుందన్నారు. ఈ సమస్యను త్వరగా పరిష్కరించాలని కోరారు.