కృష్ణా: ఢిల్లీలో జరిగిన పేలుళ్ల ఘటన అనంతరం జిల్లా వ్యాప్తంగా ఎలాంటి అవాంఛనీయ పరిస్థితులు నెలకొనకుండా పోలీసులు నిన్న ముందస్తు జాగ్రత్త చర్యలు చేపట్టారు. పోలీస్ స్టేషన్లలో పర్యవేక్షణ మరింత బలోపేతం చేశారు. బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు, మార్కెట్ ప్రదేశాలలో పోలీసులు తనఖీలు చేశారు. అనుమానాస్పద వస్తువులు కనిపిస్తే పోలీసులకు సమాచారం ఇవ్వాలని ఎస్పీ విద్యా సాగర్ నాయుడు సూచించారు.