ATP: రూడ్ సెట్లో ఈనెల 22వతేదీ నుంచి ఉచితంగా మహిళలకు బ్యూటీ పార్లర్లో శిక్షణ ఇవ్వనున్నట్లు సంస్థ డైరెక్టర్ విజయలక్ష్మి తెలిపారు. ఈ సందర్భంగా ఆమె 18-45 సంవత్సరాల మధ్య వయస్సు కలిగి రేషన్, ఆధార్‌కార్డ్ కలిగిన ఉమ్మడి జిల్లా నిరుద్యోగ మహిళలు అర్హులని పేర్కొన్నారు. 30 రోజులపాటు సాగే శిక్షణా కాలంలో భోజనం, వసతి సదుపాయం కల్పిస్తామన్నారు.