NLG: జిల్లాలో జరుగుతున్న ఉర్సు ఉత్సవాలకు నిర్దిష్ట కాలపరిమితిని కేటాయించాలని బీజేపీ నాయకులు అదనపు కలెక్టర్ శ్రీనివాస్‌కు వినతిపత్రం సమర్పించారు. గణేశ్ నవరాత్రులకు నిబంధన ఉన్నప్పుడు, ఉర్సుకు కూడా సమయం కేటాయించాలన్నారు. ఉత్సవాల్లో అసాంఘిక కార్యకలాపాలు, విద్యుత్ చోరీ జరుగుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదని వారు ఆరోపించారు.