SRD: నారాయణఖేడ్ పట్టణం శివారులోని చంద్రమౌళీశ్వర భక్త మార్కండేయ ఆలయ ప్రాంగణంలో సోమవారం రాత్రి జరిగిన కార్తీక మహోత్సవంలో సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. శివపార్వతుల ఉత్సవమూర్తుల వేదికపై బాలికలు సామూహికంగా చేపట్టిన భరతనాట్యం, ప్రేరణ నృత్య ప్రదర్శన అందర్నీ ఆకట్టుకున్నాయి. అదేవిధంగా భరత్ అనే బాలుడు శివతాండవ నృత్య ప్రదర్శన చేసి అదరగొట్టాడు.