HYD: లగ్జరీ జీవనశైలికి పేరుగాంచిన జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఓటు హక్కు వినియోగంలో మాత్రం ప్రజలు వెనుకబడి ఉన్నారు. 4 లక్షలకు పైగా ఓటర్లు ఉన్నా, ఇక్కడ పోలింగ్ శాతం నిరాశ కలిగిస్తోంది. 2018 ఎన్నికల్లో 47.2% ఓటింగ్ నమోదు కాగా, 2023లో ఇది కేవలం 47.58% మాత్రమే నమోదైంది. ప్రభుత్వం సెలవు ప్రకటించినా, ‘నా ఓటు వల్ల మార్పు ఉండదు’ అనే భావనతో నిర్లక్ష్యం వహిస్తున్నట్లు తెలుస్తోది.