ఢిల్లీలో జరిగిన పేలుడు వెనక ఉగ్రవాదుల హస్తం ఉందా? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఢిల్లీ పోలీసు విభాగానికి చెందిన ప్రత్యేక దర్యాప్తు బృందం సహా క్లూస్ టీం, NIA రంగంలోకి దిగాయి. అయితే కారులో పేలుడు పదార్థాలని రిమోట్ సాయంతో పేల్చినట్లు అనుమానం వ్యక్తం చేస్తున్నాయి. కాగా, ప్రతి సోమవారం ఢిల్లీలో పర్యాటక ప్రదేశాలకు సెలవు కావడంతో.. ప్రమాద తీవ్రత తగ్గింది.