ఢిల్లీలోని ఎర్రకోట మెట్రో స్టేషన్ వద్ద జరిగిన పేలుడు ఘటన నేపథ్యంలో ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో రెడ్ అలర్ట్ ప్రకటించారు. యూపీ ఏడీజీ అమితాబ్ యష్ ఈ విషయాన్ని వెల్లడించారు. రాష్ట్రంలో ఉన్న సున్నితమైన మతపరమైన ప్రాంతాలు, సరిహద్దు ప్రాంతాలతో పాటు అన్ని జిల్లాల్లో సెక్యూరిటీని పెంచాలని డీజీపీ ఆదేశించారు. అన్ని భద్రతా ఏజెన్సీలను అలర్ట్ చేసి తనిఖీలు పెంచాలని పేర్కొన్నారు.