SDPT: మైనార్టీలు అంటే కాంగ్రెస్ అని, కాంగ్రెస్ లేనిదే ముస్లింలు లేరని సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడడం విడ్డూరంగా ఉందని గజ్వేల్ నియోజకవర్గం బీఆర్ఎస్ ఇంఛార్జ్ వంటేరు ప్రతాప్ రెడ్డి పేర్కొన్నారు. గజ్వేల్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ.. సీఎం మైనారిటీల పట్ల చేసిన వ్యాఖ్యాలను ఉపసంహరించుకోవాలన్నారు. తక్షణమే ముస్లింలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.