SDPT: 42% బీసీ రిజర్వేషన్ను రాజ్యాంగంలోని 9వ షెడ్యూల్ల్లో చేర్చాలని బీఎల్పీ పార్టీ జిల్లా అధ్యక్షుడు తలారి ప్రవీణ్ డిమాండ్ చేశారు. ఈ మేరకు కలెక్టర్ కార్యాలయంలో వినతి పత్రం అందించారు. తదనంతరం వారు మాట్లాడుతూ.. బీసీలకు విద్య, ఉద్యోగ, స్థానిక సంస్థల్లో 42% రిజర్వేషన్లు అమలు చేయాలన్నారు. లేని పక్షంలో పెద్ద ఎత్తున ఉద్యమం చేపడుతామని హెచ్చరించారు.