W.G: దైవారాధనకు మించిన భక్తి మరొకటి లేదని, దైవ సన్నిధిలో వన సమారాధనలు నిర్వహించడం శుభ పరిణామమని రాష్ట్ర పబ్లిక్ అకౌంట్స్ కమిటీ ఛైర్మన్ పులపర్తి రామాంజనేయులు అన్నారు. భీమవరం సోమేశ్వర స్వామి ఆలయంలో ది భీమవరం మోటార్ లారీ ఓనర్స్ యూనియన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్తీక అన్న సమారాధనను ఎమ్మెల్యే ప్రారంభించి మాట్లాడారు. అనంతరం అన్నదానంలో పాల్గొన్నారు.