HNK: హన్మకొండ కుమార్ పల్లిలోని స్మైల్ డిజి స్కూల్ యజమాని శ్రీనివాస్‌పై ఓ విద్యార్థి సంఘం నేత దాడికి పాల్పడ్డట్లు వడుప్సా నాయకులు తెలిపారు. యాజమాన్యంపై భౌతిక దాడికి నిరసనగా గురువారం ఉమ్మడి వరంగల్ జిల్లా పాఠశాల బందుకు వడుప్సాలోని ఓ వర్గం పిలుపునిచ్చింది. మరో వర్గం పాఠశాలలు నడుపుతూ నల్ల బ్యాడ్జిలు ధరించి నిరసన ప్రకటించాలని నిర్ణయించుకుంది.