కాకినాడ: జిల్లాలో ఈ ఖరీఫ్ సీజన్లో సాగైన 94 వేల హెక్టార్లలో తుపాను కారణంగా 21,432 హెక్టార్ల పంట దెబ్బతింది. మిగిలిన పంట ద్వారా 6 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం అంచనా వేస్తున్నామని, ఇందుకోసం 269 కొనుగోలు కేంద్రాలను సిద్ధం చేశామని వ్యవసాయ శాఖ జేడీ విజయ్ కుమార్ తెలిపారు. నష్టపోయిన ప్రతి రైతుకు ప్రభుత్వం పరిహారం అందిస్తుందని తెలిపారు.