ASF: జిల్లా ఎస్పీ కాంతిలాల్ పాటిల్ ఆదివారం మాట్లాడుతూ, ఈ నెల 10 నుండి 15వ తేదీ వరకు జరగనున్న స్పెషల్ లోక్ అదాలత్ను కక్షిదారులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. రాజీ పడదగిన క్రిమినల్, సివిల్, కుటుంబ, ఆస్తి, బ్యాంకు రికవరీ, చెక్ బౌన్స్, మోటార్ వాహన చట్టం ఉల్లంఘన వంటి కేసులను లోక్ అదాలత్ ద్వారా పరిష్కరించుకోవచ్చని తెలిపారు.