JGL: ఇబ్రహీంపట్నం జడ్పీ హైస్కూల్లో తెలుగు ఉపాధ్యాయురాలుగా పనిచేస్తున్న కటకం కవితకు ‘కీర్తి చక్ర- 2025’ అవార్డు లభించినట్లు ఉపాధ్యాయులు తెలిపారు. కరీంనగర్ జిల్లా కేంద్రంలోని ఫిలిం భవన్లో ఆదివారం జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో నిర్వాహకులు ఆమెకు పురస్కారం అందజేసి, శాలువాతో సత్కరించారు. కవితకు ఈ అరుదైన అవార్డు రావడం పట్ల తోటి ఉపాధ్యాయులు, అభినందించారు.