MLG: వెంకటాపూర్ మండలం పాలంపేట గ్రామంలోని యునెస్కో గుర్తింపు పొందిన రామప్ప దేవాలయాన్ని ఆదివారం అమెరికాకు చెందిన పర్యాటకుడు ప్రెస్టన్ సందర్శించారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు, ప్రెస్టన్కు ప్రత్యేక పూజలు చేసి తీర్థ ప్రసాదాలు అందజేశారు. అనంతరం ఆలయ గైడ్ విజయ్ కుమార్, ఆయనకు ఆలయ చరిత్ర వివరించారు. కార్యక్రమంలో ఆలయ సిబ్బంది తదితరులు ఉన్నారు.