NZB: మెండోరా మండలం బుస్సాపూర్ గ్రామం సమీపంలో జాతీయ రహదారి 44పై ఇవాళ ఇథనాల్ ఆయిల్ ట్యాంకర్ అదుపుతప్పి బోల్తా పడింది. దీంతో ఆయిల్ రోడ్డుపై లీకైంది. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం జరగకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. మెండోరా, ముప్కాల్ పోలీస్ బృందాలు ఘటనా స్థలానికి చేరుకుని, నిలిచిపోయిన వాహనాలను వేరే రోడ్డుకు మళ్లించారు.