ADB: నవంబర్ 11 నుంచి 19 వరకు తీవ్ర చలి పరిస్థితులు నెలకొన్నందున ప్రజలు పూర్తిగా అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ రాజర్షి షా ఆదివారం రాత్రి తెలిపారు. తెలంగాణ వేదర్ మాన్ విడుదల చేసిన మ్యాప్ ప్రకారం జిల్లాలో 9-12 డిగ్రీల సెల్సియస్ వరకూ ఉష్ణోగ్రతలు పడిపోయే అవకాశం ఉందన్నారు. మరీ అవసరం అయితే తప్ప ప్రజలు బయటకు రావద్దని సూచించారు.