AKP: విజయరామరాజుపేట శివాలయంలో ఉన్న శివలింగానికి స్థానిక భక్తులు వెండి నాగాభరణం బహుకరించారు. శిలపరశెట్టి విశ్వనాథం దంపతులు రూ.4 లక్షల వెచ్చించి వెండితో నాగాభరణం తయారు చేయించారు. ఆదివారం ఆలయంలో పూజలు జరిపి గ్రామ పెద్దలు, భక్తులు సమక్షంలో అర్చకులు అందజేశారు. అర్చకులు శివలింగానికి వెండి నాగాభరణాన్ని అలంకరించి పూజలు చేశారు.