ఈజిప్ట్‌లోని కైరో వేదికగా జరుగుతున్న ప్రపంచ షూటింగ్ ఛాంపియన్షిప్ పోటీల్లో భారత యువ షూటర్ అనీష్ భన్వాలా రజతంతో మెరిశాడు. 25 మీటర్ల రాపిడ్ ఫైర్ పిస్టల్ విభాగంలో అద్భుత ప్రదర్శన చేసిన అతడు రెండో స్థానంలో నిలిచాడు. ఈ విజయంపై భారత షూటింగ్ సంఘం స్పందిస్తూ.. అనీష్ విజయం దేశానికి గర్వకారణం అని పేర్కొంది.