WGL: రాయపర్తి మండల కేంద్రంలో ఆదివారం గ్రామ పంచాయతీ కార్యదర్శి వల్లే వినోద్ కుమార్ ఇంటి పన్నుల వసూలును ముమ్మరం చేశారు. మండలంలోని 14 వార్డులోని కాలనీలలో ఇంటింటికి తిరుగుతూ జీపీ సిబ్బంది పన్నులు వసూలు చేశారు. కార్యదర్శి వినోద్ మాట్లాడుతూ.. సకాలంలో పన్నులు చెల్లిస్తేనే గ్రామ సమగ్రాభివృద్ధి సాధ్యమని, ప్రజా సమస్యలు పరిష్కారమవుతాయని అన్నారు.