TG: అందెశ్రీ మృతి పట్ల మాజీ సీఎం KCR సంతాపం ప్రకటించారు. కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. రాష్ట్ర సాధనలో అందెశ్రీ పాత్ర కీలకమని కొనియాడారు. ఆయన మరణం రాష్ట్రానికి తీరని లోటు అని అన్నారు. అందెశ్రీతో తనకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. అలాగే మాజీ మంత్రులు KTR, హరీష్ రావు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. వారితో పాటు పలువురు BRS నేతలు విచారం వ్యక్తం చేశారు.