ఆసియా ఆర్చరీ ఛాంపియన్షిప్లో భారత క్రీడాకారులు మెరిశారు. అర్హత రౌండ్లలో యష్దీప్ భోగె, అంషిక కుమారి సత్తాచాటారు. పురుషుల ర్యాంకింగ్ రౌండ్లో యష్దీప్ మొదటి స్థానంలో నిలిచాడు. మహిళల అర్హత రౌండ్లో దీప్షిఖ, యెరిన్ తొలి రెండు స్థానాల్లో నిలిచారు. వెన్నం జ్యోతి సురేఖ, ప్రీతిక ప్రదీప్, చికిత తానిపర్తి వరుసగా తర్వాతి స్థానాలు సాధించారు.