SRD: కనీస వేతనాలు అమలు చేయాలని కోరుతూ కంది పరిధిలోని ఐఐటీ ముందు ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు సోమవారం ఆందోళనకు దిగారు. కనీస వేతనాలు అమలు చేయాలని పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. కనీస వేతనాలు రాకపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని వారు తెలిపారు. ఐఐటీ ఉద్యోగులు హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు.