BDK: కొత్తగూడెం బస్టాండ్ ఏరియాలో లంబాడి హక్కుల పోరాట సమితి జిల్లా ముఖ్య నాయకుల సమావేశం ఇవాళ నిర్వహించారు. న్యాయవాది – లంబాడి హక్కుల పోరాట సమితి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రమేష్ నాయక్ బాణోత్ మాట్లాడుతూ.. 5వ షెడ్యూల్ ప్రాంతం, ఏజెన్సీలో 100 శాతం ఉద్యోగాలు స్థానిక గిరిజనులతోనే భర్తీ చేయాలని జీవో నెంబర్.3ను పునరుద్ధరించాలని పేర్కొన్నారు.