VZM: గురజాడ స్మారక గ్రంథాలయంలో గిడుగు రామ్మూర్తి తెలుగు భాష, జానపద కళా పీఠం ఆధ్వర్యంలో సీపీ బ్రౌన్ జయంతి వేడుకలు జరిగాయి. ముందుగా ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా కళాపీఠం అధ్యక్షుడు బద్రి కూర్మారావు మాట్లాడుతూ.. ఆంగ్లేయుడైన బ్రౌన్ దొర తెలుగు భాషకు ఎనలేని సేవ చేశారని కొనియాడారు.