సత్యసాయి: ధర్మవరం నియోజకవర్గ బీజేపీ నేత హరీష్ బాబు ధర్మవరం ఎన్డీఏ కార్యాలయంలో సమీక్ష నిర్వహించారు. శానిటరీ అధికారులతో సమావేశమై పట్టణాన్ని ‘క్లీన్ అండ్ గ్రీన్ సిటీ’గా మార్చేందుకు కృషి చేయాలని సూచించారు. అనంతరం వాటర్‌లైన్ సిబ్బందితో మాట్లాడి, పట్టణ ప్రజలకు నిరాటంకంగా నీటి సరఫరా జరిగేలా చూడాలని ఆదేశించారు.