NZB: తెలంగాణ ప్రముఖ రచయిత అందెశ్రీ మృతి పట్ల నిజామాబాద్ ఎంపీ అర్వింద్ సంతాపం వ్యక్తం చేశారు. ‘జయ జయ హే తెలంగాణా జననీ జయకేతనం’ అంటూ, తెలంగాణ అస్థిత్వాన్ని అక్షరమాలతో సత్కరించిన మన అందెశ్రీ ఇక లేరని, వారి సాహిత్యం ద్వారా మన హృదయాల్లో చిరంజీవిగా ఉంటారని నమ్ముతున్నానని అన్నారు. వారి పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుణ్ని ప్రార్థిస్తున్నాను అంటూ సోషల్ మీడియాలో ట్వీట్ చేశారు.