PPM: గుమ్మలక్ష్మీపురంకి చెందిన పత్తిక అశ్విని అనే లబ్దిదారునికి 43,119 రూపాయల సీఎం రిలీఫ్ ఫండ్ చెక్‌ను సోమవారం ఎమ్మెల్యే తోయక జగదీశ్వరి అందజేశారు. అనంతరం ఆమె మాట్లాడుతూ.. వైద్యం పరంగా ఆపదలో ఉన్నవారికి సకాలంలో చికిత్స కోసం అందిస్తున్న నిధులను సద్వినియోగం చేసుకోవాలన్నారు. పార్టీలకు అతీతంగా కేవలం అర్హతే ఆధారంగా ముఖ్యమంత్రి రిలీఫ్ ఫండ్ అందించడం జరుగుతుందన్నారు.