TG: రేపు జూబ్లీహిల్స్ ఉపఎన్నిక పోలింగ్ నేపథ్యంలో ఆ నియోజకవర్గంలోని ప్రభుత్వ, ప్రైవేట్ విద్యాసంస్థలు, కార్యాలయాలకు సెలవు ఉండనుంది. ఈ మేరకు కలెక్టర్ హరిచందన సెలవు ప్రకటిస్తూ.. ఇప్పటికే ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే. అటు ఈ నెల 14న కౌంటింగ్ జరిగే చోట కూడా సెలవు ఉంటుందని అధికారులు తెలిపారు.