VSP: బీజేపీ ప్రభుత్వ విధానాల వల్ల దేశంలో సామాన్యులు, వ్యాపారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని కాంగ్రెస్ విశాఖ తూర్పు ఇంఛార్జ్ ప్రియాంక దండి అన్నారు. ఆమె కార్యాలయంలో మాట్లాడుతూ.. డెమోనెటైజేషన్, జీఎస్టీతో దేశ ఆర్థిక వ్యవస్థ కుదేలైందని, ప్రజల రక్తం తాగిన ప్రభుత్వంగా బీజేపీ మారిందని ఆమె విమర్శించారు. రుణ భారం, నిరుద్యోగం పెరిగి వ్యాపారాలు మూతపడ్డాయని మండిపడ్డారు.