ATP: అనంతపురంలోని టవర్ క్లాక్ వద్ద మౌలానా అబుల్ కలాం ఆజాద్ జయంతి వేడుకలు మంగళవారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అనంతపురం ఎంపీ అంబికా లక్ష్మీనారాయణ, ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ పాల్గొని మౌలానా అబుల్ కలాం విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. భారతదేశానికి మౌలానా అబుల్ కలాం ఆజాద్ చేసిన సేవలు మరువలేమని వారు కొనియాడారు.