VZM: గృహాలకు దరఖాస్తులు చేసుకున్న వారి వివరాలను సర్వే చేసి అర్హత ఉన్న వారి వివరాలను యాప్లో నమోదు చేయాలని DRO శ్రీనివాసమూర్తి సోమవారం ఆదేశించారు. నవంబర్ 30 వరకు ప్రభుత్వం సర్వే కోసం సమయం ఇచ్చిందని, లబ్ధిదారుల సర్వే పూర్తి చేసి అప్లోడ్ చేయాలని తెలిపారు. మండల ప్రత్యేకాధికారులు సచివాలయాలను తనిఖీ చేసి ప్రొఫార్మాలో వివరాలను నమోదు చేసి సమర్పించాలన్నారు.