KMR: జిల్లాలో ట్రాన్స్ ఫార్మర్ దొంగలు రెచ్చిపోతున్నారు. నిత్యం జిల్లాల్లోని పలు గ్రామాల్లో ట్రాన్స్ ఫార్మర్ చోరీలు జరుగుతూనే ఉన్నాయి. సోమవారం పెద్ద కొడఫ్గల్ మండల కేంద్రంలో 2 ట్రాన్స్ ఫార్మర్లు, శివాపూర్ శివారులో ఓ ట్రాన్స్ ఫార్మర్ చోరీకి గురైనట్లు ఎస్సై అరుణ్ కుమార్ తెలిపారు. ట్రాన్స్ఫార్మర్ నుంచి ఆయిల్, వైర్లు చోరీ చేసినట్లు చెప్పారు.